నిజాల నిప్పు కణికలు:- -గద్వాల సోమన్న,-9966414580
వదరబోతు కోతలు
నీటి మీద రాతలు
క్షణమైనా ఉండవు
సఫలము కానేరవు

బద్ధకస్తుల ఆశలు
చూడ ఎండమావులు
ఉపయోగమే లేదు
కనొద్దు పగటి కలలు

కష్టపడని చదువులు
మంచి లేని మనుషులు
చెదిరిపోయె మేఘాలు
వాడిపోయిన కుసుమాలు

కాపు లేని తరువులు
జలము లేని చెరువులు
నీతి లేని మనుజులు
నేతి బీర కాయలు


కామెంట్‌లు