చెప్పుడు మాటలు చెరుపు:--గద్వాల సోమన్న,-9966414580
చెప్పుడు మాటలు చెరుపును
వింటే బ్రతుకులు కూలును
కుటుంబాన చిచ్చుపెట్టి
అతలాకుతలం చేయును

పచ్చగ ఉంటే గిట్టదు
ఎదుగుతుంటే నచ్చదు
అసూయ పరులే మనుషులు
ఇతరుల క్షేమం పట్టదు

స్వార్థపరులతో జాగ్రత్త!
కనిపెట్టుము ఒక కంట
 ముందు చూపు లేకుంటే
ఆవేదనలే  మన వెంట

చెప్పుడు మాటలు మధురము
వింటే మాత్రం నష్టము
తెలుసుకొనుము ఈ సత్యము
అప్రమత్తం అనునిత్యము


కామెంట్‌లు