నవ్వుల పువ్వులు:- -గద్వాల సోమన్న-9966414580
చిరునవ్వుల పూవులు
ఆరోగ్య ప్రదాతలు
చిందిస్తే చాలును
అందాలే  రువ్వుమ

దరహాసము లాభము
గట్టిపరచు బంధము
అత్యంత అమూల్యము
పరిమళించు గంధము

ఒక్కింత ఖర్చు లేదు
నష్టమసలే రాదు
ఒక్క సారి నవ్విన
ప్రకాశమే ముఖమున

నవ్వుతూ  బ్రతకాలి
బ్రతుకుతూ నవ్వాలి
నవ్వులే ముత్యాలు
ముత్యాలు రాలాలి

నవ్వులేని మోములు
అమావాస్య రాత్రులు
అందరికీ నష్టము
తెచ్చిపెట్టు కష్టము

భగవంతుని కానుక
ఆనంద వీచికలు
మోదానికి ప్రతీక
మల్లెలాంటి నగవులు


కామెంట్‌లు