అక్షర సత్యాల హారాలు: - -గద్వాల సోమన్న,-9966414580
నోరు మంచిదైతే
ఊరు మంచిదవుతుంది
తీరే బాగుంటే
పేరు తెచ్చి పెడుతుంది

మనసు శుద్ధమైతే
పసి పిల్లల్లాంటి
దైవత్వం వస్తుంది
ప్రశాంతత తెస్తుంది

మాటపై నిలబడితే
మర్యాద దక్కుతుంది
ఆదర్శమవుతుంది
స్ఫూర్తినే ఇస్తుంది

సత్యమే పలికితే
మెచ్చుకొనును దైవము
సత్యాన్వేషణ ఘనము
చేకూర్చును విజయము

బద్ధకం వదిలితే
కష్టాన్ని నమ్మితే
ఫలితమే ఉంటుంది
పట్టుదల నీదైతే


కామెంట్‌లు