నూతనోత్తేజం:- ఉండ్రాళ్ళ రాజేశం -సిద్దిపేట -9966946084
 నిన్న నేడు రేపంటూ
 సాగుతున్నవి రోజులు
 రోజులు రోజులు వారాలై
 వారాలన్నీ పక్షములై 
 పక్షములతో మాసాలు 
 పన్నెండు మాసాల వత్సరము 
 ఆంగ్ల నామ నూతన సంవత్సరము 
 జగతిన పంచును నూతనోత్సాహాము
 గడిచిన రోజులు అనుభవాలై
 వర్తమానం సాగుతుండగా
 భవిష్యత్తుకు బీజాలవును
 కంటి రెప్పపాటు క్షణాలు తిరుగుతూ 
 వెలుగు కాంతుల రవళులు నింపును 
 రాత్రి పగలు అమాస వెన్నెల
 నింగినేల పంచభూతాల సంరక్షణలో
 దిక్కులన్ని కూడా దీదీప్యమానమై
 ఆంగ్లవత్సర శోభలు స్వాగతించును
 వెనుదిరిగిన దొరకదు సమయము
 ముందుకు సాగిన ఉరకదు సమయం 
ముచ్చటించిన నిలువదు సమయము
సమయముతోని సమరం జేసి
పనులందులలో వృద్దిగా నిలిచి
రంగమేదైనా రయమున సాగి
విశ్వ విజేతగా నిలువాలి
నూతన ఆంగ్ల సంవత్సరాలను స్వాగతపరచాలి


కామెంట్‌లు