న్యాయములు-708
శుష్కస్తనీ (కంచుక) న్యాయము
*****
శుష్క అనగా ఎండినది,ఎండిపోవుట, కేవలము .స్తన అనగా చన్ను.కంచుక అనగా కవచము, పాము కుబుసము, చొక్కా,రవిక అనే అర్థాలు ఉన్నాయి.
అదేమిటో సామెతలు గానీ, జాతీయాలు గానీ,మరింకేమైనా చెప్పేటప్పుడు మొదట మహిళలనే ఉదాహరణగా తీసుకుని చెబుతుంటారు. ఈ న్యాయమును కూడా అలాగే ఉదహరించారు. న్యాయాన్ని చదివినప్పుడు బాధగానే అనిపించింది.కానీ అదేంటో పరిచయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. మరి చూద్దామా !
ఒకానొక మహిళ లావుగా మరియు పుష్టిగా వుంటుంది. ఆవిడ వద్దకు మరో మహిళ వచ్చి తాను తొడుక్కోవడానికి ఓ రవిక కావాలని అడిగితే లావుగా ఉన్న మహిళ తాను ధరించే వాటిల్లో ఒకటి తీసి ఇచ్చింది.
సంతోషంగా ఆ రవికను తీసికొని వెళ్ళిన మహిళ దానిని తొడుక్కుంది.కానీ తొడుక్కున్న మహిళ బక్క పలచగా ఉండటం వల్ల ఆ రవిక ఆమెకు వదులైంది. "ఈ పాడు రవిక ఇంత వదులుగా ఉందేమిటి?" అనుకుంటూ రవికను తిట్టిపోసింది. అయితే వదులుగా ఉండటం రవిక లోపం కాదు కదా! పుష్టిగా ఉన్న మహిళదా రవిక. ఈమె సన్నగా,బక్క పలచగా ఉండటం వల్ల అది వదులు అయ్యింది.అంటే ఆ లోపం ఆ బక్క పలుచని మహిళది. కానీ తనలోని లోపాన్ని గుర్తించకుండా రవికను తిట్టిపోసింది.నిందించింది.
దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే కొందరు తమలోని లోపాలను, అసమర్థతను గుర్తించకుండా వాటిని ఎదుటివారి మీదకు గానీ వస్తువుల మీదకు గానీ నెడుతుంటారు.
దీనిని తెలుగులో "ఆడలేక మద్దెల ఓడు" అనే సామెతతో పోల్చవచ్చు.
కొందరు వివిధ రకాల నాట్యాన్ని ఎంతో ఇష్టంగా నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం మనం చూస్తుంటాం. వారి నాట్యానికి ముగ్ధులైన విద్వాంసులు వారిని మెచ్చుకోవడం మనకు తెలిసిందే.
అయితే కొందరికి నాట్యం నేర్చుకోవాలని కోరిక వున్నా సరిగా మనసు పెట్టి నేర్చుకోరు.
అలా ఒకానొక నాట్యగత్తె లేదా నాట్యకారుడు ఒకసారి తాను ఇచ్చిన ప్రదర్శనలో చక్కగా చేయలేకపోయారు.ఆ విషయం ఒప్పుకోవడానికి ఇష్టపడక మద్దెల వాయించిన వ్యక్తిదే తప్ప మాది కాదు. మద్దెల ఓటుది.శబ్దం సరిగా మ్రోగలేదు.ఆ వాయించే మేళగాడికి మద్దెల సరిగా వాయించడం రాకపోవడం వల్లే తమ ప్రదర్శన చెడిపోయిందని తమ తప్పును అతనిపై నెట్టారు.
అసలు కారణమేమిటో చూసేవారికి అర్థమైపోతూనే వుంటుంది కానీ కొందరు వ్యక్తులు అంతే తమ తప్పులను ఇతరులపై నెడుతూ వుంటారు.
అందుకే ఇలాంటి వారిని ఉద్దేశించి ప్రజాకవి వేమన రాసిన ఓ పద్యం చూద్దాం.
"తప్పులెన్నువారు తండోపతండంబు/ లుర్వి జనుల కెల్ల నుండు తప్పు/తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు/విశ్వదాభిరామ వినురవేమ!"
అనగా" ఇతరుల తప్పులు ఎంచే వారు చాలా మందే ఉంటారు.ఈ భూమి మీద ఉన్న వారందరిలోనూ తప్పులు వుంటాయి.అయితే ఇతరుల తప్పులు వెతికే వాళ్ళు తమ తప్పులు మాత్రం తెలుసుకోలేరు "అని అర్థము.
అలా తప్పు చేసి కప్పిపుచ్చుకునే వారి గురించి కవి డా.టి.వి.నారాయణ గారు ఏమంటారో తెలుసా!
"తప్పు చేసి కూడ తమదగు తప్పును/కప్పి పుచ్చు వారు కలుషమతులు ఒప్పుకొనెడి వారు గొప్ప మనీషులు/భరత వంశ తిలక!భవ్య చరిత!"
ఇవండీ శుష్క స్తనీ(కంచుక) న్యాయము యొక్క విశేషాలు.
ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మన తప్పులను ఇతరులపై నెట్టకూడదు. ఒకవేళ తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడమనేది గొప్ప లక్షణం. కాబట్టి ఆ విధంగా వుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి