కొత్త దారి కోరుకునే
కోరికలు మనకుంటే
కొన ఊపిరి వరకు
కొదవలేవీ ఉంచుకోకూడదు
ఎంచుకున్న త్రోవ
ఎంత కఠినమైనా
ఎదురీది చేరుకునే
సహనముండాలి తప్పదు
కొన్ని కోరుకున్నందుకు
కొన్ని కోల్పోవాల్సి రావచ్చు
కొన్ని కఠినమైనా వదిలి
కోలుకోక తప్పదు
కల వరించాలంటే
కలవరాలు తప్పవు
కలతతో పంటిబిగువున
కలబడక తప్పదు
జీవన పోరాటంలో
మరో ఉదయాన్ని స్వాగతిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి