తల్లి!!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా
తెలంగాణ తల్లి ఏం చదువుకున్నది.!?
భారత రాజ్యాంగం చదువుకున్నది.!
ఫైనార్ట్సు  కాదు  కదా!!?

పిల్లలు ఏం చదువుకున్నారు 
వ్యవసాయం చదువుకున్నారు 
రాజకీయాలు కాదు కదా!!?

తల్లి ఎలాంటిదో 
తల్లికి పుట్టిన పిల్లల వల్ల తెలుస్తుంది. 
కానీ 
తల్లి ఎలా ఉండాలో 
పిల్లలు ఎలా నిర్ణయిస్తారు.!!?

తల్లిపాలు తాగిన ప్రతి పిల్లవానికి తెలుసు 
తల్లి పాలలో తల్లినీళ్లు కలపలేదని.!!
కానీ 
తల్లిపాలలో కన్నీళ్లు-నీళ్లు కలుపుతున్న 
పిల్లల్ని 
ఏ తల్లి కన్నదో ఎవరికి తెలుసు!!?

తల్లి తన చేతుల్లో ఉన్నదంతా పిల్లలకే ఇచ్చింది. 
తను చెప్పిందంతా తన చేతల్లో చేసి చూపించింది.

తల్లికి ప్రతిరూపాలు మీరు 
కోపతాపాలు చూపకండి కురుపులు కాకండి 

బంగారం బంగారమే బంగారానికి రంగు లేదు. 
తల్లి తల్లే తల్లికి ఏ రంగు లేదు. 
పిల్లలు రంగులు మార్చకుంటే చాలు. 
కానీ 
తెలంగాణ తల్లి 
ఆకుపచ్చని బంగారమైతేనే బాగుంటుంది.!!

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా. 

డా.ప్రతాప్ కౌటిళ్యా

కామెంట్‌లు