శ్లో:! నిత్యానంద రసాలయం సురముని స్వాంతాంబు జాతశ్రయం
స్వచ్ఛం సద్ద్విజ సేవితం కలుష హృత్సద్వాసనావిష్కృతమ్
శంభు ధ్యాన సరోవరం వ్రజ మనో హంసా వతం స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సుజాత శ్రమం ప్రాప్స్యసి !!
భావం: ఓ మనో రాజహంసా! చిన్నచిన్న నీటి గుంటల చుట్టూ తిరిగి శ్రమపడి అక్కడ ఉన్న క్షుద్ర దేవతలను పూజించిన ఫలమేమి? కేవలం ఈశ్వరుధ్యానం మాత్రమే చెయ్యి. ఆ శంభుని ధ్యానం మహా సరస్సు వంటిది. ఆ సరస్సులు శాశ్వత ఆనందం నీరుగాను, దేవతలు మునులు వంటి హృదయ పద్మములును, ఉత్తములైన ద్విజులు హంసలు వంటి పక్షులుగాను, నిత్యము అక్కడ సేవిస్తూ ఉంటారు. అది పాపాలను పోగొడుతుంది సత్కర్మల వల్లనే ఆ సరస్సు లభిస్తుంది. ఈ సరస్సు ఎప్పుడు కరిగిపోయేది కాదు.
*****
శివానందలహరి:-కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి