దిక్కులు చూసే భయానికి
సాయం దొరకదు ఎక్కడా?
మొక్కులు మొక్కితే దైవం
చిక్కులు తీర్చేనా?
తప్పొప్పుల నిర్ణయం నీదే
నిందలు వేస్తే చెల్లిపోతుందా?
ఎటు వైపు అడుగేయడం
ఎంత మంచిదో తెలుసుకోవాలిగా!
నీపై కరుణ కాలానికి...
కాస్తయినా వుంటుందా?
కలిసొచ్చేదాకా ఆగమంటే
వేచి వుంటుందా?
కలలు చూసే కన్నులకు
అవి చేరే దారి తెలియదు
కదిలి ముందుకు సాగి
వెదకి చేరుకోవాల్సింది నీవేగా!
కాలు సాగిన దారిలో
కంటకాలెన్నున్నా
మేలు చేసే వైపునే
వీలు చేసుకోవాలిగా
జనన మరణానికి మధ్యలో
మన అస్తిత్వం కాపాడుకుని
కొనసాగించే ప్రయత్నమనే
పోరాటమే బ్రతుకంటే!
మెత్తగా సాగే కథలన్ని
కొత్త వెలుగులో జోరందుకోవాలని
జిత్తులు లేని సాయంతో
ఎత్తులు చేరే దారి దొరకాలని
కోరుతూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి