కొమ్మలతో
ఎదుగుతుంది
ఆకులతో
పచ్చబడుతుంది
పూతతో
పరిఢవిల్లుతుంది
పూలతో
ప్రకాశించుతుంది
పరిమళంతో
పరవశపరుస్తుంది
ఫలాలతో
నోరూరిస్తుంది
పక్షులతో
సావాసంచేస్తున్నది
కాయలతో
కడుపునింపుతుంది
చల్లనినీడతో
అలసటతీరుస్తుంది
మెల్లనిగాలితో
స్వేదాన్నితుడుస్తుంది
కొయ్యలతో
కుర్చీలుచేసుకోమంటుంది
మానులతో
మంచాలుచేసుకోమంటుంది
పచ్చదనంతో
పొంకాలుచూపుతుంది
స్వచ్ఛగాలితో
ప్రాణాలునిలుపుతుంది
చెట్లతో
చెలిమిచేద్దాం
మొక్కలతో
మిత్రుత్వానిసాగిద్దాం
తరువులతో
తనువులతరిద్దాం
వృక్షాలతో
వృద్ధిచెందుదాం
ప్రకృతికి
వందనాలుచెబుదాం
సాహితికి
ప్రణామాలర్పిద్దాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి