కలల దీపాలు వెలిగే కనుల
కలత నీడలెందుకో....
కదలి సాగి పోవునేదైనా
కలిసి కాలపు వేగానా!
గతాలన్ని పాఠాలుగా
సదా గుర్తు పెట్టుకొని
నిదానించి అడుగువేస్తే
దారి తరిగి పోవునులే!
నిజము నీకు ఎరుకైతే
నిందలేమి చేయును?
నిన్ను నీవు గమనిస్తే
తప్పు తెలిసిపోవులే!
మలుపులలో తప్పక
కుదుపులుండి తీరును
ముందు దారి సుగమమైతే
పయనమంత సులువేలే!
రేపేప్పుడు తియ్యగా
ఊరించును కమ్మగా
ఆశ జీవన సూత్రమైతే
మనుగడే మధురములే!
వెన్నెలంటి వేకువకోసం
వేచి వున్న హృదయాలకు
వెలుగులన్నీ చల్లగా
కలుగు హాయి ఇంపుగా!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి