ఆశ .....!!--డా.జి.ఎన్.రావు - హైదరాబాద్.

 చిరు గాలితో   
చెలి గా మారి...... 
నాట్యమాడే  చిటారు కొమ్మ 
చిగురుటాకులా ఊగాలని,     
నీరెండలో ఓ కిరణమై 
ప్రసరించాలని ,                        
నింగిని వదిలి  నేలను తాకే 
ఓ వర్షపు చినుకుతో 
క్షణకాలమైనా 
నెయ్యంచేయాలని,                                
నిండు పున్నమి లో 
చల్లని వెన్నెల ముగ్ధ తో 
మనసారా మాట్లాడాలని  
కోరుకునే నా కోరిక తీరేనా?
అది....అత్యాశేనా....!?
             ***
కామెంట్‌లు