చిన్న మాటైనా
మనసుకు నచ్చితే
గుర్తుండిపోతుంది ఎప్పటికీ!
చిన్న నిర్లక్ష్యం కూడా
మనసుకు తెలిస్తే
గుచ్చుకుంటూనే ఉంటుంది!
చిన్ని అపార్థం కూడా
గొప్ప స్నేహానికి
దెబ్బ కొడుతుంది
చిన్ని రంధ్రం కూడా
పెద్ద పడవను ముంచేస్తుంది!
చిన్నవే అయినా కొన్ని
పెద్ద ప్రభావం చూపించి
జీవితానికి సరిపడా
అనూహ్య ఫలితాలిస్తాయి!
ప్రతి చిన్న మాటా
ప్రతి చిన్న చర్యా
ఆచి తూచి వేయకపోతే
ప్రతికూలమై పాఠం చెబుతుంది
మాటలు ఎరుగక
మమతలు తెలియక పోయినా
ఆనందమివ్వడంలో
అందమెంతో ఉందని చెప్పే
అరవిరిసిన అరవిందాలు
అన్యాపదేశంగా నేర్పే
అందమైన జీవిత సత్యాలు
అందరికీ ఆచరణీయాలే!
వేకువ వెలుగులు చూసి
ప్రియమైన వారి తలపుల్లో
మెరిసే కన్నుల్లో మెరపులా..
విరిసే పువ్వుల నవ్వులకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి