నికోకి ....
జుట్టు పెరుగుతుంది
మాములుగా కాదు
ఒత్తుగా ....
యమస్పీడుగా ....!
వాడి జుట్టు కత్తిరింపు
ఒక మహా యజ్ఞం ...
విషయం తెలియక
కసాయివాడిని నమ్మిన -
గొర్రెలా .....
హుషారుగా -
బయలుదేరతాడు !
క్షౌరశాలకు పోగానే
అసలుకథ మొదలౌతుంది
ఆరున్నొక్కరాగం
అమలులోనికి వస్తుంది !
అక్కడ బార్బర్బోయ్
గొప్పనిపుణుడు ....
సఫిల్ గూడాలో
ఒకసాధారణ బార్బర్
అయితేనేమి -
పిల్లాడిని ఆటల్లో పెట్టి
నా వళ్ళో కూచోబెట్టి
చకచకా పనిపూర్తిచేస్తాడు !
శభాష్ ..అనిపించుకుంటాడు !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి