తమ్ముడు
పుట్టాడని తెలిసి
అనందంగా --
ఆసుపత్రికి చేరుకుంది
అక్క ' ఆన్షి ' !
అమ్మా -నాన్నలు
ఆనందంగా నవ్వుతుంటే
తికమకలో ' ఆన్షి '
తింగరమొఖంతో చూస్తుంది
ఫోటోకోసం
ప్రత్యేకంగా ....
నవ్వలేకపోతున్నది ...!
తమ్ముడి పుట్టుక -
తనమీఁద తల్లిదండ్రుల ప్రేమలో
తేడావస్తుందనో ....లేక
ఎలాంటి ప్రబావం చూపుతుందో అన్న
ఆలోచన కావచ్చు ....!
ఇవేమి పట్టని తమ్ముడు మాత్రం
తల్లిచేతిలో
నిద్రపొతున్నాడు హాయిగ !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి