న్యాయాలు-707
శుక నకులికా న్యాయము
****
శుక అనగా చిలుక.నకులిక అనగా ముంగీస.ఇవి రెండూ ఆయుధముల పేర్లు.
కాకు దీక శుక నాక నలిక మొదలైనవి అస్త్ర విశేషాలు.అవి పైకి చూడటానికి భయం కలిగించవు కానీ యుద్ధ సమయములలో రథ గజ తురగ మొదలైన దళాలకు చాలా హాని కలిగిస్తాయి.
అలాగే "పైకి చాలా సుఖముగా కనబడిననూ కామము అనేది మానవుడిని అధోగతి పాలు చేస్తుంది."అని అర్థము.
దీనినే నీలకంఠాచార్యులు అనే కవి గారు మహా భారతంలోని ఉద్యోగ పర్వములో" కాకు దీక శుక నాక మక్షి సంతర్జనం తథా...అను శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ఈ విధంగా ఉపదేశించారు.
" కాకు దీక మిత్యాదయోష్టాస్త్ర విశేషాః!/...యేన శుక నలికాన్యాయేన అభయేపి భయదర్శినో హాయరథాది పాదేషు గాఢం శ్లిష్యన్తి తచ్ఛుక మోహనం నామః!!" అనియు మరొక ఉదాహరణ కూడా ఉటంకిస్తూ - శుక నలిక న్యాయముచే స్వకామ పరికల్పితమే కానీ ఆత్మకు వాస్తవానికి కర్తృత్వము,బంధ మోక్షాదికము లేదు అంటారు.
ముఖ్యంగా ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు విశేషాలూ ఏమిటంటే...
మనిషి ఏవైతే సుఖాలుగా భావించి వాటికోసం వెంపర్లాడతాడో,వేటికోసమైతే బంధాలు అనుబంధాలు వదిలి అనుక్షణం ఆ తాపత్రయాల వలలో పడిపోతాడో అప్పుడే అతని పతనం ప్రారంభమవుతుంది.
అయితే అలాంటివన్నీ చూసేందుకు మృదువుగా, అనుభవించేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తూ మనసూ తనువునూ మాయా జాలంలో చిక్కుకునేలా చేస్తాయి.ఆ విధంగా మనిషిని లోబరుచుకుని అధోగతి పాలు చేస్తాయి.
ఇంతకీ అవేమిటో అనే సందేహాలు ఎవరికైనా మదిలో మెదులుతుంటాయి కదా! అవే అరిషడ్వర్గాలు. అరిషడ్వర్గాలలో ఒకటైన కామము మనిషిని దిగజార్చడంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తుంది.
అందుకే మన పెద్దలు "అర్థాతురాణాం నగురుర్నబంధు,కామాతురాణాం నభయం,నలజ్జా!/విద్యాతురాణాం నసుఖం ననిద్రా,క్షుధా తురాణాం న రుచిర్నపక్వం!! "అన్నారు.
అనగా" ధనాశాపరులకు గురువు, బంధువుల పట్టింపు లేదు.కామం కళ్ళకెక్కిన వాడికి భయమూ, సిగ్గు వుండదు.విద్యాపేక్ష కలవానికి సుఖము, నిద్ర ఉండదు.ఆకలిగా వున్నవానికి రుచి,ఉడకడం గురించి ఆలోచన వుండదు" అని అర్థము.
ఇక విషయానికి వస్తే కామము అంటే ఇక్కడ మనం రెండు కోణాల్లో చూడాలి.ఒకటి శారీరక సుఖం అనే కామం. దాని వల్ల కొంత మంది మన కళ్ళ ముందే ఎంతో నీచానికి తలపడి చివరికి సుఖవ్యాధుల బారిన పడటమో, అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసి జైలు పాలవ్వడమో చూస్తున్నాం.
ఇక రెండో రకం స్వార్థంతో కూడిన కామం అంటే కోరిక. అన్నీ తనకే కావాలన్న కోరిక. అది కూడా అందరికీ దూరంగా ఉంచి చివరికి ఒంటరిని చేస్తుంది.
కాబట్టి ఏవైతే అనర్థదాయకమైన సుఖాలు ఉంటాయో వాటి జోలికి పోకూడదని ఈ "శుక నకులికా న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
అయితే కొసమెరుపుగా ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే ఇదంతా మనిషి మనసుకు సంబంధించినదే కానీ ఆత్మకు సంబంధించినది కాదు అంటారు.
ఏవి ఏమైనా విషయాలు తెలిశాయి కదా! అన్నింటికీ కారణం మనసే కాబట్టి మోహాలు, వ్యామోహాల జోలికి పోకుండా మనసును మంచి పనుల వైపు మళ్ళిద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి