అడుగడుగున ఆనందాలు
ఆణువణువున ఉత్సాహాలు
అదుపు లేని ఉహాలు
అంతులేని సందేహాలు...
ఆశల పల్లకిలో ఉరేగే
అలుపులేని అంతరంగం
అనువుగా మారే అవకాశం
అందుకోవాలని ఆత్రాలు
గడచినవి గురుతులేదు
రేపు ఏమౌనో ఎరుక లేదు
ఈ క్షణం జీవితం అపురూపం
అందంగా మలచుకునే ప్రయత్నాలు
తడిసేటి కనులకు జ్యోతిగా
నడిచేటి పదములకు తోడుగా
గుడి అయిన గుండెలో దివ్వెగా
పొడిచేటి పొద్దులో కనిపించే
కలలు తీర్చే కన్నతండ్రి
చేయి వదలని సైదోడు
దారి చూపించు దైవానికి
ఎద సడులే గుడిగంటలుగా
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి