ఊరుగాలి ఈల:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
తీగలల్లకున్న బీర కాకర పాదుల బంధం
కడుపు నింపే కంచం బచ్చలిపప్పుదే   
నీడనిచ్చే చెట్ల చింత తొక్కు  పచ్చడి  మెతుకు

పండ్ల తోటల కాచే మామిడి రేగు జామ కాయలు 
కోడి మేక గొర్రెమాంసాలు తిన పబ్బమే
చాయకాఫీల తాగే అతికొద్ది ఇండ్ల ఊరు

చెట్టు చెరువే బతుకు మైదానాల మనిషి
పొలం పనుల ఊపిరి బడివొడి వెలికట్ట
గిరి దాటని మాట బతుకు చెలియలికట్ట

చెప్పెటోళ్ళ నాలుక దరి వినేటి వీనులు 
ఆటపాటల తీరుగా బేతల మాటామంతీ
పెద్దోళ్ళ ప్రేమల చిన్నోళ్ళ మర్యాదే ఊరు

ఊరంటేనే ఆనంద భేరి సంగీత కచేరి
బాగోతాల పందిరి బాలనాగమ్మ సందడి
వేషమేసే కళాకారుల నేల సేదదీరే ఊరు

అప్పు తప్పుల బతుకు తిప్పల్లేని జగం
పల్లె వాసనంత మంచి మర్యాద కుదురు
నమ్మకం జీవించు ద్రోహచింతన బెదురు

తేటతేట తెలుగురా ముఖభాష ఊరులే
గుండె గొంతుకలో పారాడు గూడు 
మమతలన్నీ మించేటి మమత చెట్టేగా

===================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent imagery and description with the poet's distinct style. Salutes