శ్లో:! ఆనందామృతపూరిత
హరపదాంభోజాలవాలోద్యతా
స్థైర్యాపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశేఖాన్వితా
ఉచ్ఛైర్మానసకాయ మానపటలీ మాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్థితా !!
భావం: పరమేశ్వరుని సేవ అను కోరిక నీటి పోతగాను, పరమశివుని చరణకములములు పాదుగాను, స్థిరత్వము ప్రాకుడు కొయ్యగాను,
అమరి కొమ్మలతో, రెమ్మలతో, బయలుదేరి క్రమముగా ఉన్నతములైన మనసులు అనే పందిళ్ళ మీదకి ప్రాకి పీడలు లేకుండా శిధిలము కాకుండా ఉన్న ఈ భక్తి లతా మా తల్లి నాకు నిత్యమైన అభీష్ట ఫలములు ఇచ్చుగాక!!
****
శివానందలహరి:- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి