న్యాయములు-703
శర పురుషీయ న్యాయము
*****
శర అనగా బాణము, దెబ్బ, నీరు.పురస్ అనగా ముందు ,ఎదుట,తూర్ఫున అనే అర్థాలు ఉన్నాయి.
"శరశ్చ క్షిప్తః ప్రాకారాచ్చ పురుష ఉత్థితః, స తేన హతః!/తత్తుల్యం శర పురుషీయమ్!!"
అనగా ఒకడు గోడవైపుకు బాణమును వదిలినప్పుడు దాని వెనుక నుండి అదే సమయంలో ఒక వ్యక్తి తల బయటకు పెట్టడంతో ఆ బాణము సరిగ్గా ఆ వ్యక్తికి తగిలి మరణించాడు.
అనగా ఎవరిని ఎప్పుడు ఎలా మృత్యువు కౌగిట్లోకి తీసుకుంటుందో తెలియదు. బాణం వేసిన వ్యక్తి తను నేర్చుకోవడానికో లేదా అక్కడ ఇంకేదైనా ఉందో అని బాణం వేశాడు తప్ప అతనిని చంపాలని కాదు.అలాగే చనిపోయిన వ్యక్తికి ఆ బాణం వచ్చి తనకు తాకుతుందని ఊహించడు. ఇలా యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను ఉద్దేశించి మన పెద్దవాళ్ళు ఈ "శర పురుషీయ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
కేవలం మృత్యువు అనే కాదు ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరి ఊహకు అందదు. మనం కేవలం నిమిత్తమాత్రులం. ఎంతటి వారైనా విధి ఇచ్చే తీర్పుకు కట్టుబడ వలసిందే.
రామాయణంలో ఎండ కన్నెరుగని సీతమ్మ అనుకోలేదు 14 సంవత్సరాల వనవాసాన్ని శ్రీరామునితో కలిసి చేస్తానని, అందులో రావణుని చెరలో సంవత్సర కాలం ఉండాల్సి వస్తుందని. అది అపవాదై నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవిలో గడపాల్సి వస్తుందని.దీనిని దృష్టిలో పెట్టుకొని ఓ గొప్ప కవి రాసిన ఈ పాట లవకుశ సినిమాలోది. మహాసాధ్వి సీతమ్మ తల్లి గురించి "ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?/ విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు?/ అంటూ ఘంటసాల పాడిన పాటలో ఎంతో అర్థం వుంది.
మానవ రూపంలో అవతరించిన సీతమ్మే అన్ని కష్టాలు పడింది.ఇక మనమెంత వారమని భక్తులు వాపోతుంటారు.
నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు చూస్తూ వుంటాం.ఎప్పుడు? ఎవరు? ఎలా? ఈ నేల రాలి పోతారో తెలియదు.
మానవుడు ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపాడు, అనూహ్యంగా ఎదిగాడు కానీ మానసికంగా కాదు.
అయితే మానవులందరికీ తెలుసు.ఈ భూమ్మీద ఎవరమూ శాశ్వతం కాదు అని.అయినా కొందరు మోసం,దగా, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని దుష్కార్యాలు చేయాలో అన్ని చేస్తూ వృద్ధాప్యం సమీపించే వేళ సన్యాసం స్వీకరించి దాసుడి తప్పు దండంతో సరి అన్న విధంగా గతాన్ని కప్పి పుచ్ఛుతుంటారు.
అందుకే ప్రజాకవి వేమన ఇలా అంటాడు." చావు వచ్చినపుడు సన్యసింఛేదెట్లు/కడకు మొదటి కులము చెడినయట్లు/ పాపమొకటి గలదు ఫలమేమి లేదయా/ విశ్వదాభిరామ వినురవేమ!"
అనగా అవసాన దశకు చేరుకుని సన్యాసం స్వీకరించినంత మాత్రాన పూర్వం చేసిన తప్పులు, చేసిన పాపం ఎటూ పోదు.దాని ఫలితం అనుభవించక తప్పదు.సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందని ఆశ పడటం తప్పు అంటాడు.
"జాతస్య మరణం ధృవం" అన్న సత్యాన్ని తెలుసు కదా!ఇకనైనా కళ్ళు తెరవండి అని అర్థము ఒంటి స్తంభం మేడలో దాగినా వచ్చే మృత్యువు ఆగదు.
ఈ "శర పురుషీయ న్యాయము "ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మరణం ఎప్పుడు ఎలా;: వస్తుందో తెలియదు . కాబట్టి ఈ రోజు గడుస్తున్న సమయమే,ఈ గడియే మనది కాబట్టి మంచి పనులను వాయిదా వేయకుండా చేద్దాం.అందరి గుండెల్లో మనల్ని మనం శిల్పంగా మలుచుకుందాము.'

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి