సంప్రదాయాల చిల్లుకు సాక్ష్యం, ‘ భోక్తలు ‘ కథ .. !! —డా . కె. ఎల్ . వి . ప్రసాద్

 భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ,ప్రాణాన్ని బట్టి తలోరకంగా అనిపించి నప్పటికీ మొత్తం మీద ‘’ ఇది భారతీయం ‘’ అనేట్లుగా ఉంటాయి . ఏ విదేశీయులై
నా ,మన సంస్కృతీ సంప్రదాయాలను యిట్టె గుర్తు పట్టేస్తారు . అదీ మన ప్రత్యేకత !
ప్రస్తుత సమాజం పశ్చాత్త్య పోకడలకు మొగ్గు చూపుతుంటే , పాశ్చాత్యులు మాత్రం 
మన సంస్కృతీ సంప్రదాయాలవైపు చూడడం మనం గమనిస్తున్నాము . మన –
సంప్రదాయాల పట్ల మనకే గౌరవం లేకుండా పోతున్నదన్నది పచ్చి నిజం . కుల 
మతాలను పక్కన పెడితే ,ప్రాంతాలను వేరుగా అధ్యయనం చేస్తే ,అవి మన మంచికి ,మన ఆరోగ్యానికి ,మన క్రమశిక్షణకు ,కుటుంబాలమధ్య ప్రేమానురాగాలు 
పెంపొందించుకోవడానికి ,మంచి ఆలోచనలతోనే నిర్ణయించ బడ్డాయి . పరిశుభ్రత–
కూ ,పర్యావరణ సంరక్షణకు పట్టం కట్టాయి . అవి అర్ధం కాక కొందరూ ,అర్ధంకాకుం
డా ప్రయత్నం చేసిన కొందరివల్ల ,కొందరు వాటిని స్వార్ధానికి ఉపయోగించుకోవడం 
వల్ల మన సంప్రదాయాలకు గండి పడుతూ వచ్చింది . కొందరికి ఇది వ్యాపారంగా మారి సంప్రదాయాలను అపహాస్యం చేసే పరిస్థితి దాపురించింది . అందువల్ల సంప్ర
దాయాలను ,మామూలు విషయాలుగా తీసుకోవడంతో ,నిర్లక్ష్యానికి గురి అవుతు-
న్నాయేమోనని భావించక తప్పదు . అలంటి సంప్రదాయాలలో ‘ తద్దినం ‘ ఒకటి . 
                 తద్దినం .. అంశాన్ని నేపధ్యంగా తీసుకుని ,కథా రచయిత శ్రీ పాణ్యం 
దత్త శర్మ ‘ భోక్తలు ‘  ( దత్త కథాలహరి   కథల సంపుటిలో )అనే కథను రాశారు . 
ఇది చదివిన తర్వాత ,ఇలాంటి కథలు తప్పనిసరిగా ప్రజల్లోకి (పాఠకుల్లోకి )వెళ్ల-
వలసిన అవసరం ఉందనీ ,పాఠకుడిగా ,కథా రచయితగా నాకు అనిపించింది . 
విషయం అందరిదీ కనుక ఈ కథ,కథా ప్రియులందరూ చదవాలని నాకు అనిపిం-
చింది . 
బ్రతికి ఉండగా తల్లి దండ్రులను పట్టించుకొనకపోయినా ,సరిగా చూడకపోయినా వారి వృద్దాప్యం ఒక నరకంగా వారు అనూహ్యావించినా ,చనిపోయిన తర్వాత మాత్రం కొందరు సంప్రదాయాలను తూ .చ ,తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తారు . నిజంగా తల్లిదండ్రులపై ప్రేమ వున్న వారు ,నిష్టగా -భక్తి శ్రద్దలతో చేయ 
వలసినవన్నీ చేస్తారు . మరికొందరు బయటి జనం కోసం చేస్తారు ,వారికి ఇష్టం 
లేకపోయినా,మమ.. అనిపిస్తారు . ఇక ఇప్పుడు భోక్తలుగా వచ్చే బ్రాహ్మణులకు 
ఇది డబుసంపాదించుకునే వ్యాపార మార్గం అయిపొయింది . సంప్రదాయాలూ ఆచారాలు ,పాటించవలసిన వారు ,పాటింపజేయవలసిన వారూ వీరే అయినా 
ఆ తద్దినం క్రియను ఒక వేళాకోళం ప్రక్రియగా చేయడం ‘ భోక్తలు ‘ కథలో మనం చూడవచ్చు . ఎంతో డబ్బుఖర్చుపెట్టి ,అవసరమైన సరంజామా కొని ,రకరకాల వంటలు - పిండివంటలు ,భోక్తలకోసం సిద్ధం చేస్తే ,భోక్తలు ,శుచీ - శుభ్రత పాటించకుండా ,ఆహార పదార్ధాలను ముట్టీ ముట్టనట్టు చేసి వండినదంతా చెత్త -
కుండీ పాలుచేయడం ఎంతవరకూ సమంజసం ?తిండి తిప్పలు లేక ఎంతోమంది 
బీదవాళ్లు ఆకలి చావులు చస్తుంటే ,అన్యాయంగా ఆహారపదార్ధాలను వృధాచేయ-
డం ,నేరం కాదా !తాంబూలాలు ఇచ్చేటప్పుడు మాత్రం అధిక సొమ్ము డిమాండు 
చేయడం వంటివి రచయిత కళ్లకుకట్టినట్టు ఈ కథలో చూపించారు . ఇదే అనుభవం 
రుచి చూసిన ఆ జంట ,తర్వాతి సంవత్సరం ,ఈ తద్దినం ప్రక్రియకు మిత్రుల సలహా
తో ,మరో మార్గం ఎన్నుకోవడం ,అక్కడకూడా వారు దగాపడడం ఎవరికైనా బాధ అనిపిస్తుంది ,అంతమాత్రమే కాదు ,ఆలోచింప జేస్తుంది కూడా !
ఈ కథకు రచయిత ఇచ్చిన ముగింపు గొప్పదీ ,ఆహ్వానింపడగ్గదీను . కథలోని 
పాత్రలు ,దత్తాత్రేయ ,హిరణ్మయి తీసుకున్న నిర్ణయం రచయిత ఆలోచనకు ,సహృ
దయతకు తార్కాణం . ఆ దంపతులు తమ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 
తర్వాతికాలంలో ఇక తద్దినం కోసం భోక్తల అవసరం లేకుండా చేసుకున్నారు . ఆరోజు చేయవలసిన వంటకాలు అన్నీ చేసి ,బయట ఆకలితో అలమటిస్తున్న పేదలకు ,అవిటివారికి ,బిక్షగాళ్లకు అందించడం అనే ఆలోచన గొప్పది అందరూ ఆచరించదగ్గదీను !
నా దృష్టిలో రచయిత ఈ కథ రాసి గొప్ప సాహసమే చేశారని నా అభిప్రాయం . ఈ కథ చదివి ఎవరైనా భుజాలు తడుముకున్నారేమో ,ఈ కథా రచయితకు అనుభవ
మయ్యే ఉంటుంది . ఇలాంటి కథలను పాఠకులు చదవాలి ,పత్రికలూ ప్రాధాన్యత–
నివ్వాలి . ఇలాంటి కనువిప్పుకలిగించే కథలు రాసే కథకులు కూడా ముందుకు రావాలి . కథల పోటీల్లో ఇలాంటి కథలే ముందువరుసలో నిలబడాలి . ఒక మంచి 
కథను చదివిన తృప్తిని అందించిన కథా రచయితకు హృదయపూర్వక ధన్యవాదా
లు ,శుభాకాంక్షలు . 
                                     ***
కామెంట్‌లు