చాటింపు....!!: -డా.కె.ఎల్.వి.ప్రసాద్.
 మానండోయ్ 
మానండోయ్  ,
ఉల్లిపాయను 
విడనాడండోయ్!
రుచిమరిగామని 
భావించి..
ఉల్లికి -
బానిసలమైనామని 
తలఁచి ...
కొండెక్కి కూర్చున్నాయి 
ధరలు...
వాటిని 
వాడడం మానేస్తేనే 
తెలుస్తుంది ...
కష్టమర్ కున్న విలువ రేపు !
ఉల్లిపాయ మరిచిపోండి 
ఓ ..వారంరోజుల పాటు ,
అదే దిగివస్తుంది మెల్లగా  ,
వాడిన రేఖలా 
మన చెంతకు భువికి !!
              ***

కామెంట్‌లు