శ్లో:!
ఆకాశేన శిఖీసమస్తఫణినాం నేత్రా కలాపీనతా
నుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
వేదాంతోపవనే విహారరసికాం తం నీలకంఠం భజే!!
భావం: ఆకాశనిచేత శిఖ గలవాడవు , సర్పముల రాజైనా వాసుకి ఆభరణము గా గలవాడవు. నమ్రత గల వారిని అనుగ్రహించునట్టి ప్రణవోపదేశమునకు సంబంధించిన "కేకీ" అని గానము చేయబడుచున్న వాడవు, మేఘ కాంతితో ఒప్పు శ్యామలాంబను చూసి సంతోషముతో నాట్యము చేయువాడవు, వేదాంతము అనెడి ఉద్యానవనము నందు విహరించుటకు ఆసక్తి కలవాడవు అయిన ఆ నీలకంఠుని పూజించుచున్నాను
*******
శివానందలహరి:-కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి