త్యాగమయి మా ..అమ్మ ..!!-డా.కె .ఎల్ .వి.ప్రసాద్ .
 దిండి గ్రామంలో 
పుట్టడం ....
కానేటి వెంకమ్మ 
కానేటి తాతయ్య 
నాతల్లిదండ్రులు 
కావడం ...
వారికి నేను -
ఆఖరి సంతానం 
కావడం ...
నిజంగా నా అదృష్టం !
ప్రజాపోరాటాలలో 
స్వచ్చమైన కమ్యూనిస్టుగా 
మానాయన పాల్గొంటూ 
అజ్ఞాతవాసంలో కొన్నాళ్లు 
తర్వాత రాజమండ్రిజైలుకు 
తిరుగుతుంటే --
కన్నపిల్లల్ని 
కంటికిరెప్పలా 
కాపాడుకున్న మహాతల్లి 
మాఅమ్మ ....
కానేటి వెంకమ్మ ...!
తను తిన్నా -తినకపోయినా 
పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు 
రానివ్వని మాఅమ్మ 
గొప్పత్యాగమయి ....!!
                   ***

కామెంట్‌లు