దృష్టి :- స్వాగత్, ఆరో తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటిపాముల, జిల్లా నల్లగొండ, తెలంగాణ
 అనగనగా ఒక ఊరు సెప్టెంబర్ 2023న ఇద్దరు కమల పిల్లలు పుట్టారు, ఒక నీ పేరు భీమ్ ఇంకో ని పేరు రాజు ఇద్దరికి ఐదేళ్లు వచ్చా యి. ఇద్దరు రోజు పనికి వెళ్లే వాళ్ళు కానీ రాదు కొంచెం మీద సరిగ్గా దృష్టి పెట్టేవాడు కాదు, ఆటలు బాగా ఆడేవాడు కానీ భీమ్ మాత్రం ఒక రోజు కూడా తప్పకుండా  బడికి వెళ్ళేవాడు. ఆటలు తక్కువ ఆడేవాడు. అన్నం తినేటప్పుడు కూడా చదివేవాడు, చిన్నదానంలోనే అంతగనం చదివేవాడు. వీళ్లకు 14 ఏళ్ళు రానే వచ్చాయి ఒకరోజు రాజు ఆడుకుంటుంటే కిందపడ్డాడు అప్పుడే  భీమ్ పక్క నించెల్లి వెళ్తున్నాడు. గాయాలైన రాజును చూశాడు ఇంటికి తీసుకుపోయాడు, రాజు ని చూసిన తల్లి భీమా భాయి కళ్ళు తిరిగి కింద పడింది. వెంటనే వాళ్ళ నాన్న నీళ్లు తెచ్చి కళ్ళ మీద చల్లాడు భీమా భాయి కళ్ళు తెరిచింది.  భీము రాజు కు తగిలిన దెబ్బలకు పసుపు పోసి దూది పెట్టి పైంగా ఒక తెల్లని కట్టు కట్టాడు, తల్లి లేచి అది చూసి అలా కడితే ఎలా తగ్గుతుంది అని అడిగింది దానికి భీమ్ నేను చదివిన ఒక్క పుస్తకంలో ఉన్నది అది గుర్తుకు వచ్చేలా కట్టాను అన్నాడు అలా కొన్ని రోజులకు భీమ్ దెబ్బలు తగ్గిపోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు అప్పటినుంచి రోజు బాగా దృష్టి పెట్టి చదవడం మొదలుపెట్టాడు. ఆటలు తగ్గించాడు.

నీతి :- దృష్టి పెడితే ఏదైనా సాధిస్తాం 

                            
         
కామెంట్‌లు