పల్లె బాగుంటేనే ప్రపంచ శాంతి. ;- డా. సి వసుంధర, చెన్నై. - సెల్.09790878439
 ప్రకృతి పరిచింది పచ్చని పట్టు పరుపులను. అవి పల్లె సిమలా? అవును 
పవిత్ర  ధామములే.
కొన్ని వడ్ల గింజలు 
ఉద్భిన్నమై  
నింపాయి రైతుఇంటిని, ప్రజల 
కడుపులను. ఎంతటి గొప్పపని! 
 
ఇంటింటా వెల్లి విరిసింది సంక్రాంతి. క్రాంతి. పల్లెకంతా 
పండుగా రుచులతో 
నిండింది హృదయం.

 భోగి, భోగాలతో 
పెద్ద పండుగ, పెద్దల దీవెనలతో, కనుమ ,
హనుమను  బోలిన
పశుసంపదతో 
పల్లెలు మరు మల్లెల వలె తెల్లగా, చల్లగా వర్ధిల్లాలి. 
నైగమాలలో దొరకని శాంతి, జనపదాలలో 
సమకూరాలి.
 కల్లాకపటం ఎరుగని
పల్లె ప్రజ చల్లగుండాలి.
కామెంట్‌లు