వేమనను తెలియనివాడు వెర్రి
వానికిందే లెక్క. ఇప్పటి పిల్లలకు ఇలాంటి వారిని
ఎవరిని తెలియదనుకోండి.
మనం చిన్నప్పుడే వేమన, సుమతి మొదలైనవారి శతకాలు పూర్వం చదివే వాళ్ళం.
వేమన మానవతవాది. కుటుంబం అన్న మాటకు పరిపూర్ణార్థం చెప్పిన వ్యక్తి వేమన. ప్రపంచమంతా ఒక కుటుంబం అన్నాడు.
కులమత భేదాలతో, ఆడ ,మగ వాదాలతో
అట్టుడికి పోతున్న
సమాజానికి చక్కని సూచనలు చేసి, అవసరమైన చోట ఘాటుగా హెచ్చరించి వేమన రాసిన పద్యాలు వేద వాక్యాలు.
మూఢవిశ్వాసాలతో అర్థం లేనిఆచారాలతో
నలిగిపోతూ,
మూర్తి పూజలకు అధిక ప్రాధాన్యత నిచ్చిన మానవుడు
తార్కక దృష్టిని
కోల్పోతున్నాడు అని
వేమన మాట.
వేమన కాలానికి ముందున్న తరాల వాళ్ళు, బీద ,గొప్ప చూడకుండా బంధు ప్రీతితో వివాహాలు జరుపుకునే వారినీచెప్పి
రాను రాను ధనిక వర్గం, పేద వర్గం అని
రెండుగా ఏర్పడి సమాజం విడిపోయిందన్నాడు వేమన. ధనంతో ఏర్పడే పెళ్లి,
ప్రేమతో ఏర్పడే పెళ్లి
(బీదవారైనా) రెంటీ మధ్య తేడా ఇలా తెలిపాడు వేమన.
కలిమి చూచి యియ్య- కాయ మిచ్చినట్లుండు
సమునకియ్య నదియు -
సరసతనము
పేదకిచ్చు మనుము- పెనవేసినట్టుండు
*******
విశ్వదాభిరామ- వినురవేమ.
వేమన చూపిన ఉపమ దాంపత్యానికి
చక్కటి వాక్యం.
డబ్బు శరీరసంబంధమై సౌఖ్యాలను ఇవ్వగలదు.
వియ్యానికి కయ్యానికి సరి సమానత్వం ఉంటే అది మంచిదే.
మూడవ పాదం,
పేదవానికి పిల్లనిచ్చిన, తీసుకున్న ఆ సంబంధం ఎలా ఉంటుందంటే, రెండు తాళ్ళను కలిపి పేణినప్పుడు ఆ రెండు విడదీయరానివిగా ఒకటై పోతాయి.
పేదవానితోసంబంధ బాంధవ్యాలు
ప్రేమతో పెనవేసుకుపోతాయని వేమన చక్కటి తెలుగు మాటల్లో చెప్పడం ప్రశంసనీయం.
ఇప్పుడూ మనం చూస్తూనే ఉన్నాం. ధనికుల ఇళ్లల్లో, ధనం కోసం ప్రేమ ధనాన్ని వాళ్ళు ఎలా కోల్పోతున్నారు ఆన్న విషయం.
వేమన పద్యాలు అన్ని కాలాల సామాజిక రోగాలకు చక్కని ఔషధాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి