నేను ఈ రోజు చాలా గొప్ప పని చేసానోయ్” గర్వం గా అన్నాడు సుబ్బారావ్.
“ ఏం చేసారండీ ?” ఆశ్చర్యంగా అడిగింది అనసూయ.
“ అనారోగ్యం తో ఇంటి పనులు చేసుకోలేక సతమతమౌతున్న నీకు తోడూ నీడగా వుండేందుకు మీ చెల్లెల్ని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాను” అసలు సంగతి చెప్పాడు సుబ్బారావ్.
“ఆ !”
2. “ స్కూలు ఎడ్మిషన్ల కోసం పరుగులెత్తే పేరెంట్స్ ను చూస్తుంటే నీకు ఎవరు గుర్తుకొస్తున్నారు” అడిగాడు రాజు
“ ఆవుల వెంట పరుగులెత్తే దూడలు గుర్తుకొస్తున్నాయి నాకు” తాపీగా చెప్పాడు వాసు.
3. “ “మంచి టీచర్ కావాలంటే ఏం చెయ్యాలో కాస్త చెబుతారా ?” విమ్రతతో అడిగాడు ఆ రోజే ఉద్యోగం లో చేరిన అప్పారావు.
“ అంతే ఏమిటయ్యా నీ ఉద్దేశ్యం ? చెడ్డ టీచర్లు కూడా వుంటారా ? “ కోపం గా అడిగాడు సీనియర్ టీచర్ అయిన రామారావు.
“ మీరు ఉన్నారు కదా సార్. నా ఉద్దేశ్యం లో నేను మీలా కాకూడదనే ముందు జాగ్రత్త కోసం అడుగుతున్నాను సార్” అసలు సంగతి చెప్పాడు అప్పారావు.
నవ్వుతూ బ్రతకాలిరా -- 17:- సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి