ఊరుగాలి ఈల 43:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మనిషి మరువలేని చదువు అమ్మ ఆవు మాట 
అ ఆల భాషలో పెనవేసే అమ్మ ఆవు పాలసొగసు
రాయి రత్నమాయె చెమటతో తివిరిన ఊరు

బంధాల అనుబంధం అల్లుకున్న రసరమ్యం
అధరాల సుందర కలలే భువి ఊరే రాగం
అడవిని వెలిగే వెన్నెల పొంగే కరుణాక్షి ఊరు

తీపితీపి మాట మూట సంపెంగ తోట సుమబాల
అందాల స్నేహాల కోమల వని త్యాగాల నేల
అర్థమున ఎద పంచిన అర్థతాత్పర్యం అవని పల్లె

చంద్రకాంతిలో చంద్రకాంత శిల సేదదీరే గిలి కన్నె
ఇంద్రధనుస్సు నింగి తేలే మనసులూగే ఊరు
లెన్సులేని కంటి రెటీనా తెర ఆట బాపు బొమ్మ

భావోద్వేగాల కవిత నడకల తడి జీవమే పల్లె 
వర్డ్సవర్త్ ఫ్రాస్ట్ వన ప్రకృతి ఎగిసే మూగ మనసు
దేవులపల్లి ఎంకి పాటల నండూరి  తేటతేనెలపల్లె

పుట్టినూరు సొంతూరు పొరుగూరు  ఊరు పేర్లేలే 
నోరార పలకరించే తీపి పల్లె మరిచిన మనిషిఎద
మంచు తుంపర నటన ఎద తామరాకు పల్లె పద!

కన్నీరు మున్నేరు మిన్నేరు ఏరు తీపిబాదే ఊరు
సుఖముల స్వర్గము బాధల కడగండ్ల విద్య పల్లె
ఇల గొప్పమనసు ఆత్మీయ మాతృగుండె  ఊరు
==========================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు