ఊరుగాలి ఈల 45:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఎగిరేసిన జండా రెపరెపల పకపకలే ఊరంతా
హింస హనన ఛాయలేని పల్లే సంవాదాల్లేని మట్టి
గట్టి మనసుల దయను నిర్మల ఉషస్సుల ఊరు 

నర భయము చోరభీతి లేని కొత్త స్వర్గమే ఊరు
ఆలనా పాలనా అపురూప నేత్రాల చిత్రాలు చూడ
పురుగు బూచీ బాధలే లేని పల్లె చెక్కిలి నవ్వేపైరు

నింగి చుక్కలు ఇంద్రధనసుకూ ఈసే పల్లెపై
సూర్యుడి వేడి చంద్రుడి చలువ మెండైన ఊరు
మనిషి మాట తీపి ఊట ఒకచోట తోట ఊరు

అతి మధురమీ మేడ అపూర్వనీడ గుడిసెవాసి
ఆకుల అందాల పూలు జానపదం జాలు ఊరు
మధురమీనాక్షి లేపాక్షి బసవన్న  రామప్ప గొప్ప

ఆయధంలేని సాయుధం ఊరు ప్రహరి జనగోడ
మనిషి తేజము పరభోజము కాని ఘనసాంద్రనేల
రుషుల మౌనం మనిషి ప్రాణనది రెండు జెళ్ళసీత

కనుల నిద్ర ఎదవొయ్యి కథే పొయ్యి పెయ్యి ఊరు
నిదుర కలల కలత దీరు ముదము నఖ శిఖం 
సిన్మా షికారు వింత హరికథ బుర్రకథలే పల్లెనేల

మనసిచ్చిన మగువ కంటరక్ష పెనిమిటి ప్రేమమీర
కలుపుదీసిన చేల వరికంకి తలూపే ధాన్యసీమ
అవనిలో పని చేయు సుఖసఖుడే గొప్ప ఊరు

============================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు