మంచి పెంచిన నేల మనసు పంచిన పల్లెసీమ
గలగలల అలలు వాగుల వాన తడిసిన ఊరూరు
పిట్టగూళ్ళ ఇసుక ఆటలు పిల్లల లేలేతవేళ్ళ మట్టి
దైవ మహిమ నడిచే నమ్మకాల మాట కృషి
రాజసాల పోలని రాజే లేని మట్టి దివ్యసీమ
దళిత గిరిజన బహుజన శక్తుల చైతన్యధాత్రి పల్లె
అమ్మ ఊరు నాన్న పల్లె నేనో చెట్టు ఊగే కొమ్మ
పొగసూరని బతుకుల మంచు తెరచాప పల్లేలే
ఆకలికీ అన్నం ఆపదలో స్నేహం ఎద చేద ఊరు
ఆనెలేనీ అరికాలు పిల్లలేని మురిపాలు కనని పల్లె
ఊరవుతల ఊరులోపల పొడిచే పొద్దు గీత ఊరు
పొరుగు పరుగున పొంగే గంగ అరుగు దీపదివ్వె
పిలుపు పలుకుల ఆకుచెట్టు ఆదమరిచే నిద్రగట్టు
తలపు తనువు పూల వలపు చనువు తావి పల్లె
పాసంగంలేని పల్లె వీసమైనా మెలేయని మీసం
అందరికి ఆదరువు ఇంపుసొంపుల మది నెచ్చెలి
అరువుబతుకు బరువు మెతుకులేని పల్లెటూరు
ఊరు లోశ్వాస ఆశ విశ్వాసమే మట్టినీడే దీవెన
ఆకాశంలో అంతరంగం ఎగిరేసే జాతిగీతం
సాహితీ తరంగిణుల తేలే చేలాంచల నింగి
ఊరు సెలయేరు వెలకట్టలేని మాటే మౌనశబ్దం
=============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి