ఊరుగాలి ఈల 47:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఎవరు పోలిక ఏలిక ఎవరు లేరు తానై పల్లే అన్నీ 
ఓర్పు సీతాంశ నేర్పు కృష్ణగీత తీర్పు స్వాతినుతి
లోతు సముద్రం విస్తృతి ఆకాశం లయ కొమ్మల

చేద బాయి దూప తోకబాయి తడి  దీర్చే ఊరు
తెలియని నొప్పుల దేవులాడే పల్లె పాతాళగరిగ 
అధరాలవీణ వదనాలవాణి గీర్వాణి మట్టిమణి

ఈ దారిల ఊరు ఆ దారి ఊరు నడిచే రహదారి
తొండి మొండి లేక బండి నడక ధీమ పల్లెసీమ 
కుట్ర పుట్రల నెత్తి మొలవని ఊరు కుస్తీల మేస్త్రీ

గడీలు లేని రక్షణకోట మట్టిమనిషి ఎద కైతల నేల
తల్లి బహుముఖ సేవల పెంచే చేశక్తి పల్లె కృతి
పుడమి అంచుల మెరిసే మెరిగెలేని మెతుకు నేల

ఆరాధనే బలమైన గొప్ప మనసుపల్లే నా ఇల్లు
చీకటి కపటాలు కడతేర్చు తటాకాలు ఊరునిండా 
ఆరబోసిన అందాలు చిగురుపచ్చ నేల మాఊరు

నోరూరు రుచుల పులుసున దేలే చేపల వంట
కోడికూర జిహ్వతాపాలు దీర్చే అప్పలే సర్వపిండి
ఊల్లాకు కొతిమిర మిర్చీకారం ప్రేమపల్లె భేష్

బంధు ప్రేమ అమేయ రాగసీమ అజేయ గుండె
ఆదిగురువులు మది అమ్మానాన్న పెంచ పల్లె
మట్టిలో నింగిని ఎక్కడ వెతక దొరకని నాఊరు

==============================
(ఇంకా ఉంది)
---------

కామెంట్‌లు