చల్లగ మెల్లగ వీచే పిల్లగాలి ఊరు ఉత్తరగాలి
అన్ని బాధల దాచే గుండెలు కరిగించే బండరాళ్ల
అస్త్రకారిలో మట్టిబతుకు జలధి ఓషధి పల్లెసీమ
మనిషి మాటే పొట్టనింపు కళ చేతిలో బువ్వ
అలుపుసొలుపుల ఆలన ఊరు నది నడకలు
మిద్దె మేడల్లేవు మెడలొంచిన పల్లె మది మనిషి
తేనె వానలు కురిసే నేల దున్నే నాగలే పల్లెసీమ
పొన్నపూల వాకిల్ల నీటితీగల హేల బతుకు ఊరు
రక్తచందనం బతుకు గుండె ఆడే మది మైదానం
చెమట కాపే తోటమాలి పూలఫల నిధి పల్లె
రాగాల కొలువున గీతాల నింగి వంగేవొళ్ళు నేల
ఆకుల కంచాల దొప్పదోసిలి కలశం ఆశదీర్చే పల్లె
కత్తి కొడవలి ఇంట ఉపకరణలే బతుకు గట్టిమట్టి
ప్రతిమది కలిసే ఊరుఎద నా బతుకు పల్లె ఇల
ప్రతిమచేతి ప్రమిద కాంతి ఊరు ఊపిరి పాట
ఆటపాటల గెలుపోటముల తోట తీపిచేదు పల్లె
ఆకుచాటు పిందె ఊరు వలసబాధే వసుధ
అమ్మ కొంగు చలువ చెలికొంగు పొంగు వేడి ఊరు
బడికి దారి మరిచి పొలంబాట పట్టే సోపతి ఊరు
చెమట చెరువుల ఎద ఒడ్డు తడి బతుకు ఊట
నారువేసిన నేల వానకారు కోయిలపాట ఊరహో
======================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి