ఊరుగాలి ఈల 50:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
గాలి వీయదు ఈల వేస్తది ఊరు ఊపిరి ఆడ
ఎదురొచ్చె కౌగిలింత మది పలక రాసిన పల్లె పాటై 
పులకింత ఒక్కటే ఎక్కడైనా ఊరుధ్యాసే మనిషి

రంగు రుచి వాసనల మంచిచెడు లిట్మస్ ఊరు
చెట్టుచేమ ఆరేసే కొమ్మల అంగీ లాగు కొంగు పల్లె
మనసు మురిసిన గాలి ఊరు ఎద ఎలనాగ

ఊరు ఊరే ఏరు ఊరొక్క మేరుపేరు ఊరే ఊరు
తీపిమాట సొరుగు తేనె నురుగు ఎదల   జోరు
గాలిభాష మదియాస మనిషిశ్వాస ఊరు సారు

ఈ ధూళి కెందూలి రంగోళి తేరు మాఊరు గోల
మైదానమే లేని ఆటపాటల గలగల ఊరు ఊరే
ఊసుల ఊటతోటల వని జవ్వని ఊరుగాలి ఈల

మానవత కొంగు మనసు చెంగు పొంగుల ఊరు
పల్లెపదాల కవిత భావాల అభివ్యక్తి ఉక్తి ఊరు
మనిషి గలగలల మనసు గోల ఊరుగాలి ఈల

మనసుపట్టి మట్టితోడుగ నడక ఊరు బడి సాలు
పుట్టి పెరిగిన నేల బతుకుచేవ్రాలువీడిన ఊరు
విడిపోని ప్రకృతి మాట ఇల ఊరుగాలి ఈల  

ఘోషించు వేదాల అందచందాల కళల ఊరు 
బతుకు పచ్చని గుండె రాసే కవిత ఊరు  
వెయ్యియాభై పాదాల త్రిపద ఊరుఈల  నమస్తే

=================================
(ముగిసిన ఊరుగాలి ఈల)
---------------------------------------------

కామెంట్‌లు