అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి ఒకరోజు ఒక కోతి చెట్టు మీద ఎగురుకుంటూ అడవికి దూరంగా ఉన్నా ఓ గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలో చాలా కుక్కలు పిల్లలు ఉన్నాయి. కుక్కలు కోతిమీదికి ఎగబడుతున్నాయి కోతి వాటి నుంచి తప్పించుకుని కొంత దూరం వెళ్ళిపోయింది. అక్కడ చాలా పిల్లులుకూడా ఉన్నాయి, అవి చాలా అందంగా ఉన్నాయి కానీ అందులో ఒక నల్ల పిల్లి కూడా ఉంది. దాన్ని చూసి మిగిలిన తెల్ల పిల్లలు ఎక్కిరించేవి, ఒకరోజు ఒక తెల్ల పిల్లి చెట్టు మీదికి ఎక్కింది కానీ ఎక్కినంక చెట్టు కొమ్మలో ఇరుక్కుంది దిగడం రావడం లేదు. అప్పుడు అక్కడికి నల్ల పిల్లి వచ్చింది. అక్కడ తెల్ల పిల్లి మ్యామ్ మ్యామ్ అని మొత్తుకుంటూ ఉంది. అది నల్లపెల్లి చూసి దాని దగ్గరికి వెళ్ళింది. చెట్టు కొమ్మలో ఇరుక్కొని దిగారాని తెల్ల పిల్లి నల్ల పిల్లి వైపు దీనంగా చూసింది. అది అర్థం చేసుకొని నల్ల పిల్లి చెట్టు కొమ్మలో ఇరుక్కున్నటువంటి తెల్ల పిల్లిని తెలివిగా కొమ్ములో నుంచి తీసి కిందికి దింపింది. అప్పుడు తెల్ల పిల్లి నల్లబెల్లి తో నిన్ను అనవసరంగా నేను నల్లగా ఉన్నావని తిట్టాను, నన్ను క్షమించు, ఇంకోసారి అలా అనను నేను. చేట్టు కొమ్మలో ఎరికిన నన్ను తీసి కిందికి దించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పింది. ఇప్పుడు నుండి ఆ రెండు మిత్రుడుగా కలిసిమెలిసి ఉంటున్నాయి.
నీతి :- రంగును బట్టి గుణాన్ని అంచనా వేయకూడదు. అన్ని రంగులు గల వారిలో అన్ని రకాల గుణాలు ఉంటాయి.
స్నేహానికి రంగు అడ్డు కాదు :-గుండ్ల సోను, 6తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటిపాముల, నల్గొండ జిల్లా తెలంగాణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి