కన్నపేగు కదిలిన మట్టి సాకిన నేల బతుకే ఊరు
గుండెలో ఊరు అద్దంలో కొండ మనిషి క్రీడ కోర్టు
అమ్మనాన్న ఇల్లు మనిషి కళ్ళంలో ఆశ ధాన్యం
మనతోనే కుటుంబం,అవే ఇల్లూ అన్ని ఊర్లే దేశం
సొంత ఇల్లు ఊరు మనిషి బతుకు జాతి దేశమై
నాది నుండి మనది మాటే విశాల దేశంలో మనిషి
దేశం జాతిజనం ఉనికి మట్టిరా వనాల నదీ జీవం
బంధాలన్నీ మనిషీ ఇల్లూ చుట్టే ఊరు జాతినేల
చొచ్చుకొచ్చేది ఎవరైనా ఉనికి గాలిదైన యుద్ధమే
ఇంటా బైటా బతుకు రొద సొదల మట్టి మనసు
నడకలెక్కలే గణిత సామాన్యశాస్త్ర బతుకు పల్లె
ఊరుకథ బుర్రకథ మనిషి బాధవ్యథ గాలి నేల
కంచెలేక పెరిగే అడవి ఎదిగే పల్లె మంచెపై స్వేచ్ఛ
పచ్చదనం ప్రకృతి పరం వెచ్చదన వరం కోరేఊరు
మాట తేటిపాట తేలే తీపి బాట ఊరు స్థిరచిత్తం
అమ్మమాట ఏలే అన్నిభాషల ఆర్ద్రత నిండే ఊరు
నాజూకు అందాల ఊగె తల కురులు తాకే పల్లెల
కొత్త ఆటలు నవ్యపాటలు ఎగిసే నింగి ఊరలా
అతుకుల ఆకాశం గతుకుల అవని చెమటే ఊరు
పాతకొత్తల మేలికలయిక నవ్యదారుల పల్లెపని
పలు భాషల ఎన్నో ఊర్ల సందడి ఒక్కఆత్మ దేశమే
===================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి