ఊరుగాలి ఈల 63:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
తంగేడు పూల కొంగుసిరి పొంగు బంగారమే ఊరు
అలరు కవి అభివ్యక్తి బతుకైన భావోద్వేగాల పల్లె
ఊరు ఊటలు చేద మోటబాయి ఆటల దీవించ

అడవి పూలే బతుకమ్మ స్ఫూర్తి ఊరు బతుకే ఆర్తి
ఎదలు కలిపే ఆట ఆడపడుచుల పాట పల్లె నింగి
మనసు లోమాట ఆత్మీయ నోట వినుడె ఊరుగా

పూజించు నేలలో పున్నమి ఊరు దయామయి
చలికి గొంగడి జంట మనసు వీటి వెంట గీతమాల
జన నాలుకల వేదం కలం రాసే కవితలే పల్లెసీమ

అనురాగబంధ ఆనందతాడవం పల్లెతీగల తల్లి
పొట్టకొచ్చే పైరుల తడి మడుల అందాల కంకిపల్లె
ఊహల తిరిగే చలనచిత్రాల సుందర రేఖ ఊరు

భాషలో భాష అందమే అమేయ అమ్మతోనే ఊరు
ఆశపడు ఊసుల పల్లెపదమే ఊరు నవ్వే తొవ్వల
తల్లి నా నడకలో రేపటి మైదానం పాటే పల్లెసీమ

చేతి మిఠాయి అల్లంమురబ్బా తీపి మనసే ఊరు
కాటగల్వని పిల్లడు ఇల్లుకై వెతకని జాడే పల్లెసీమ
బలుపులేక బక్కచిక్కిన వారి కంచాల బువ్వ పల్లె

చెలిమి చెలిమెల కలిమిలేములు నిద్ర కళే ఊరు
అందమంతా ఆమెతోనే మమతలన్నీ పంచే పల్లె
మనిషి మనిషికి గూనతారు ముచ్చట పల్లె బతికే

=====================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు