గుండెలో రుధిరం దండలో సుమం విరిసే ఊరు
వృత్తిపని చేతుల మెరుపు సుత్తెల మాటే పల్లె
ఆకలి ఆశకు తెగనిముడి వేళ్లకు పనిచ్చేదే ఊరు
ప్రతిమనిషిలో ప్రభ ఉన్నది ప్రతిభా ఉంది పనే పల్లే
బాధల ముళ్ళబాట సంతోష పూలబాట కళేఊరు
నడిచే ఉదయపు సూర్యుడు అలిసిన కథే ఊరు
మనిషి నికార్స్ మాట కుదురు ఊరే ఖుల్లం ఖులం
మట్టి బలం తట్టిలేపే మనసు వీణమీటే పల్లెసీమ
ఊరు ఊరని ఊగిసాగే జోరు ఘనతే ఊరుసిరి
కోహినూర్ హీరా టూవీలర్ హీరో ఊరే ధడ్కన్ సై
దయగల జీవి అస్తమించని పనిపాట నోటి పల్లే లే
దానాల గొప్ప ధర్మాల పెబ్బ పిల్లలాడే ఊరంట
కొత్త సృజనల రాసేది పల్లే యుగళ గేయాలు
సంగీత ఝరిలో గీతాల రాగపల్లకి మోసే ఊరు
వినయ విజయాలు వినిపించే కనుల మకరజ్యోతి
పల్లెపుట్టిన జీవి రోషపడు నేల కోపమేరుగని సీమ
విలువపెంచి మనసుపంచే భూమాత సిరి ఊరు
స్వప్నసీమలేలు మేఘాలులేని చెమటబావి ఊరు
కందికాయ సీమచింతకాయ రుచుల నోరే ఊరు
నోరు కట్టేయని కాయలు పండ్లు కాచే గొప్ప పల్లె
మోటబాయీ నీరు శనగపూల పూసే చుక్క పల్లే
================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి