ఊరుగాలి ఈల 69:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
పని మట్టిదే మాట గట్టిదే ఊరహో వెన్న గురిగి
మన్ను బుక్కి మన్నుదినుడంటే బువ్వ పల్లెసీమ
కలిసిన నవ్వు  ఏడ్పు కలిసే మనిషేవేరు ఊరొకటే

దూపకూ ఆకలికీ బొక్కెన చేదే బావి పనే పల్లెసీమ
పగలూ రాత్రి పనీపాటే పల్లె మొద్దుకాదే హూషార్
కహానీ ఘర్ ఘర్ కీ మాహోల్ అలగ్ దేఖ్ గాఁవ్ఏక్

గాలికి స్వతంత్రత నీటికి స్వేచ్ఛదారి పల్లె పదం
ఎగపోత లేదూ వడపోత లేదు దూరం జడవాతం
చలనమే మనిషి ఆకలిని జయించే గొప్ప ఊరట

గోల లేదు మాలూ లేదు ఈల ఊదేదే కళల ఊరు
జంతు ప్రేమ చెట్టు ప్రాణం నిమిరే వేళ్ళే పల్లె నాడి
ఆశల గుండె కదిలే కన్నుల ఊహ గొంతెత్తే ఊరు

ఆట మైదానాల పెకిలే గొంతు పాట లయాత్మ ఊరే
వేట ఆటవికం పోరు శూన్యం కలిపేదే గొప్ప పల్లె
నమ్మేది చెమటను నడిచేది కృషిపథం పల్లే గ్రంథం

ఆకు గుండెకు ఆనే చెవి మనసు తడిమే ఎద పల్లె
సోపతిలో బాధ మాయం మది వీణలు మోగే ఊరై
చెరువు ఆదరువు పరువు పల్లెఎద కిష్మిష్ కిస్మత్

పండుగ కాదు దండుగ ఊరు బతుకు దస్తూరీరా
ఎండలో వాన వానలో ఎండ సయ్యాట ఊరుగీత
చెదలుపట్టని ఎద చెట్టుబోదె కథల కలలే పల్లేతీపి
-------------------------------
(ఇంకా ఉంది)

కామెంట్‌లు