వాకిట నిలిచే అమ్మ చీకటివెలుగు ఊరు ఉనికే
రేపటి కళ నేటి చెమట చెలిమె తోడే సోపతి పల్లె
అరచేతి ఆట కాదు ఐదు వేళ్ళ శ్రమ దీపమే ఊరు
అలల కడలి అంతరంగం కలలు కదిలే రణం ఊరే
లోతూ విస్తృతి సంద్రం పాతిన విత్తనం ఆశే పల్లెగ
ఎక్కే ఎత్తుకాదు దిగే లోతే ఎద ఊరేగా ఆరాధన
ప్రతిబింబం పెద్దది బింబం చిన్నదైన నీతే ఊరుకథ
కలిసిన ఊరు మట్టి బలం దాని చిరు ఊపిరేఊరు
అందని ద్రాక్ష పుల్లనే మరి పొందే భరోసా గిరేఊరు
ఒకరికొకరు ఆసరా తిరిగే వసారా చెట్టునీడన పల్లే
అలుకా కోపం నిలువని అందాలు ఊరిదేరాజనీతి
జ్యోతి వెలుగులే మనసు జోతే సుమాల పల్లెసీమ
ఆడని ఆట దండుగ ఆడి గెలిచేదే పండుగ ఊరు
పొద్దంతా పనిచేనుల పొద్దుగూక ఊరు తేనెపట్టు
రామ కోటి అమ్మమ్మే నగరంలో రాంకోటి ఊరేసిరి
ఒకసారి రా!నువ్వు గుర్తించవ్ నిన్నూ ఊరేమరిచే
బొమ్మ అందంలో మనిషి ఆత్మేదీ పగలేని కల పల్లె
తెలువని ప్రశ్నల తెలిపే జవాబు ఊరు గాలితేలే
ఒక బాటను అడుగు ఈ అడుగెటని రిప్లై పల్లెకని
చూచిరాతగాదు దొంగరాతకాదు ఊరు చిరునవ్వే
మన జన్మ ధన్యం తులతూగే సిరిధాన్యం ఊరేలే
==============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి