ఏందబ్బా!ఊరును పట్టేసిన కవి ఎవరో నా బాట
ఆలాపన అదే ప్రశ్న ఊరైనది టపావిప్పే గుండె
ఉయించే రవి విప్పారే ఊరైన కవిఎద పాటే నేను
అమ్మపాలు ఆయమ్మ ఉగ్గుబువ్వ పెంచిన ఆకు
సంచిల పొత్తం చదివిన వేళ్ళ లయలో నేనే ఊరు
అందెల నవ్వు మొలనగ సిరుల ఊరే నా బతుకు
'అఆ' లే నేదిద్దిన లేత చేతులు కందిన పాదం బడి
జడలుకట్టి బొట్టుదిద్దింది అమ్మే నేను ఊరోన్నిగా
రెక్కల కింద పొదిగి రెక్కలెదిగి ఎగిరిన పల్లెజీవిని
అక్షరం ప్రాణదీపం నాది బడి స్నేహగీతం పల్లెనేల
ఆటలాడే పసితనం ఏమి తెలియని బేలనే నేను
ఇంటి ప్రేమ బడిశిక్షణ కాపున ఎదిగిన నేనే ఊరై
సోపతోళ్ళ వరుసలో బుడ్డనేనే బడి చదువే ప్రీతి
ఆశ దోశ అప్పడం లేనేలేదు పలక బలపం నాదే
ముఖకాంతి చదువే కష్టాల కడలీదే విశ్వాసంపల్లే
అలుపులేని విసుగులేని నడక నేర్పే ఊరు పదని
భయంలేక బాధలేక సాగినపాటే నా బంధాలనేల
కంటికి రెప్ప నా బతుకు రెక్కల ఊరే మిత్రమైత్రి
ఆడించిన ఉసికవాగు మదినిండా ఆటే బతుకు
ఎక్కిన చెట్లూ కోసిన పూలూ జడలై ఆడే బాలనే
ప్రేమపంచి మమతనింపిన సోపతే చదువైతి నేను
==================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి