మళ్లీ వచ్చేసింది సంక్రాంతి మకరసంక్రాంతి
సందళ్లను చూడగా అందరిమనముల కలిగె విభ్రాంతి
సన్నాహాలకు సన్నద్ధమైంది సహనశీలి ఐన ఇంటింటి ఇంతి
ముంగిటిముగ్గుల నిగ్గులను నింగినుండి మెచ్చింది సూర్య కాంతి
పతులరాకకు నవసతుల ముఖముల దొరలె సిగ్గులదొంతి
గడపలక్ష్మిని కొలువ పసుపు కుంకుమలతో మెత్తే పచ్చ చేమంతి
గొబ్బెమ్మల కొప్పులపైనొప్పి కులికే
పూబంతి
ప్రతి ఇరువురి కరములు కలిపి
శుభకరముగ సల్పిరి మాటామంతీ🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి