ఆవేదనే నివేదన. :- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797..
1.
నా మనోహర మురహర,
      ఈ దీనుని మొర వినరా! 

నీవు గాక వినేవారు ,
మరి నాకు ఎవరూ లేరురా!

నీవే విననంటే, వినకుంటే ,
            నాకు దిక్కెవరురా! 

ఈ మనుషులదేమిటో,
 చెవులున్నా చెవిటివాళ్లేరా!

చెవిటి వారికి శంఖారావం,     
           ఏలరా సింహాచలేశా!

2.
నా బుద్ధికి ఏ తత్త్వం కూడా,   
    కించిత్ అర్థం అవకున్నది! 

దేహాన నీవిచ్చిన తత్వం,
    మంచులా కరుగుతున్నది! 

ఈ మనసు సాధన చేస్తున్నా,   
       అదుపు తప్పుతున్నది! 

క్రమేపీ వయస్సు స్థిర, ఆయువు అంచు చేరుతున్నది! 

నీకేదో చెప్పాలని ఆశేరా, 
       శ్వాసరా సింహాచలేశా!

3.
కామం కసిగా కాటేయ,
 క్రోధం విషమై ఎక్కినవాడ్ని! 

"మద"గజమెక్కి నర లోకాన,
           విహరిస్తున్న వాడ్ని! 

"మోహ"జాలరి వల, బిగించగా చిక్కుకున్న జీవుడ్ని! 

సంసార లోభ ప్రలోభం,
 లొంగి లేవలేని తామసుడ్ని!

మాత్సర్యం పొందు వీడలేని, 
       విటుడ్నిరా సింహాచలేశ!
________


కామెంట్‌లు