19.మంచికి మంచే జరిగిందా, జగాన మంగళకరమే!చెడుకి చెడే ,శిక్ష పడిందా, లోకాన గుణపాఠమే!మంచికి చెడే దాపురిస్తే, జనమంతా పరితాపమే!చెడే అప్రతిహతమైతే, కలియుగావలక్షణమే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!20.నేనో బాటసారి నడకే, నిర్దేశించిన రహదారే!ఆలోచనే లేదు సంపూర్ణ, నిషేధమే రాక్షసదారే!ఏమిటో తిరకాసే ,నా జీవనగమనం ముళ్ళదారే!రాజీ పడని పోరాటమే ,బతుకు వరద గోదారే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!22.కలడనే వారికి కలడు,అన్నది పోతన్న మాటే!నా జీవన యాత్రలోన,నేనూఎంచుకున్నగా, ఆ బాటే!నానమ్మకమేమాత్రమూ ,నీవే వమ్ము చేయకు,ఊరటే!ఊరుకున్నావా ఆస్తికత్వ, కోటకే పడు పెద్ద బీటే!ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!_________
ఆవేదదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి