4.
గుర్తుతెలియని బాల్యం,
నా అజ్ఞానాన గడచినది!
గుట్టు తెలిసిన యవ్వనం, మధువనమై విరిసింది!
కట్టు తెంచుకున్న వార్ధక్యం, వడిగా చుట్టుముట్టేసింది,!
అలసటతో ఉన్న మేను, అడుగైనా వేయనన్నది!
దుఖం ఆహారమై కంఠాన, దిగదురా, సింహాచలేశా !
5.
గతం ఎంతో గొప్పదే కానీ, స్వగతమై నోట రాకుంది!
వర్తమానం అనుమానం, అనుక్షణం పెనుభూతమైంది!
భవిష్యత్తు కాలమానం, కొలమానం కానరాకున్నది!
కాలమా ఆగని ప్రవాహం, సాగడం నా ధర్మమన్నది!
జీవనమా ప్రమాద సంభవం, కావవా, సింహాచలేశా!
6.
నా ఉనికి బతుకు భాషలో, జగాన ప్రశ్నార్ధకము!
నా మనికి జీవన యాత్రలో, జనాన ఆశ్చర్యార్థకము!
నేనిప్పుడు పని చేసినా,
అది అవ్వదు సఫలము!
నేను పుట్టిన ఊరికి,
నాకు చేరలేనంత దూరము!
ఈ భూమికి నేనెంతో భారము, దించరా సింహాచలేశా!
_________
ఆవేదనే నివేదన.: - డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి