ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-\9441058797.

 76వగణతంత్రదినోత్సవం.   శుభాకాంక్షలు.

===============================
 13.
నేనసలు  ఉటంకించే, ఉత్తముడ్ని ఏనాడు కాను! 
నరజన్మ సుకృతమై ,
లభించగా బతుకుతున్నాను! 
అసుర లక్షణాలెన్నో, అంకురించే, ఆపలేకున్నాను! 
కనీసం నరుణ్ణి చేయమని, నిన్ను వేడుకుంటున్నాను! 
ఆ దిశగా నడిపించు, 
చింతతీర్చు మా సింహాచలేశా!
14,
నడుస్తున్న కాలమే ,
ఎడారి ఆరోగ్యమాయే ఆవిరి! 
ఆనారోగ్యం జతకట్టే ,
వీడిపోని గొప్ప సొగసరి! 
నమ్మిన వాళ్ల ఆధారమా, మూసుకుపోయే రహదారి! 
అసలు కలియుగం,
 ధర్మమే బతికే కొన ఊపిరి! 
బతుకు వరమా? శాపమా? చెప్పుమా,  మా సింహాచలేశా!
15.
మనిషి సాటి మనిషి ,
మాట వినననే బధిరుడే!
ఎంతసేపూ తనలో తానే, 
ఏదో గొణుక్కుంటూ ఉంటాడే!
నా మాట వినిపించ, వినేవాడెక్కడా కనపడడే!
నా శ్వాస ఆడుతున్నదా?
 నాడిచూసే నాధుడు ఉన్నాడే!
 బతుకంతా ఎదురుచూపులా?
చెప్పు, మా సింహాచలేశా!
_________

కామెంట్‌లు