22.ప్రపంచాన మానవులనగా, ఆస్తికులు నాస్తికులే!ఆస్తికులైనవారంతా,విశ్వాదర్శ పరమ భక్తులే!భక్తి ఆధారంగా,దైవమే విశ్వమన్న స్థితప్రజ్ఞులే!వారే దైవకృప అనుభవించిన, కారణజన్ములే!ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!23.ఎన్నాళ్ళు మనకుంటారే? జన్మనిచ్చిన అమ్మానాన్నలు!గౌరీ శంకరులే ముందూ ,వెనకా ఉన్న అమ్మానాన్నలు!మన వెంట ఉండే వారి,దీవెనలు పూచిన పొన్నలు!మనపై కన్నెత్త లేవు,మరే దుష్ట గ్రహాల దున్నలు!ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!24.దేహమున్నంత కాలమే, బతుకంటే ఓ యమయాతనే!సాధనెంతగా చేయి,మాయగీత దాటలేక వేదనే!ఇంద్రియానుభవాలు సరి,ద్వంద్వమే రావాలి యోచనే!ఉపాధి అనుభవ పూర్తే, మనిషి ముక్తికి యోజనే!ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!________
ఆవేదనే నివేదన. :- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి