ఆవేదనే నివేదన!:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
28.
మనుషులెవరైనా విన్నా,
  కాసింత జాలే పడతారే!

వారేమీ పరిష్కరించరే, సమాధానమూ ఇవ్వలేరే! 

అనుగ్రహించి ఆపదనివారించే, వారు కానరారే! 

జనం నిన్నే ప్రాధేయపడుతూ, నీ వెంటే పడుతున్నారే! 

ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!

29.
జనాలంతా ఆర్తులే, అర్ధులే, అనాథులే, అభాగ్యులే! 

మరి నీవే సృష్టించావే?
 కారా వీళ్ళు సైతం నీ బిడ్డలే! 

వీరూ నీ కృపా పాత్రులే,
 కర్మవశ కాలోపహతులే!

నేడిక్కడ ఆటవిక న్యాయం , 
నీకే న్యాయం చేయ వీలే!

ఆవేదని నివేదన ఆలకించు, మా సింహాచలేశా!

30.
వసుధ గురుత్వాకర్షణ, బంతిగా నీవు ఎత్తినదే! 

గోవర్ధనమే చిటికెన వేలిపై, మరి నిలిచినదే! 

ధర్మసంస్థాపన కురుక్షేత్రం, నీవల్లే నడిచినదే!

నా కష్టం ఏ పాటి?
 నీ ఆకర్షణ విశ్వమే లొంగినదే!

ఆవేదనే నివేదన ఆలకించు మా సింహాచలేశా!
________


కామెంట్‌లు