మా శ్రీరామ స్తుతి :- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
హే రామ రామ ఓ రఘురామ
నీవేలే ఇక మా అందరి ధీమా
జన సయోధ్యతోని ఓ శ్రీరామ
ఘన పాలన పొందే అయోధ్యసీమ

విని నీ తల్లి మాటను నెరవేర్చ
కని నీతండ్రి బాటను సరికూర్చ
చేసావులే నీవు అరణ్యవాసం
మోసావులే సీత శరణ్య సహవాసం

వాలి సుగ్రీవుల స్నేహం చేశావు
అపవాదును సైతం మోసావు
సుగ్రీవుని ఆపద తొలగించావు
ఏకగ్రీవ మోక్షమునే అందించావు!

మహావిష్ణువుగా ఈజగమున దీపించి
ఆహా వైష్ణవమాయను నీవు జయించి
శ్రీరామునిగా జన్మించావులే నీవిల
రఘురామునిగా నెరవేర్చావులే మా కల!

చైత్ర శుద్ధ నవమి నాడునీవు పుట్టావు
చిత్తశుద్ధితో అయోధ్యలో కాలు పెట్టావు
అన్యాయాల అధర్మాల అరికట్టావు
ఆ ధర్మదేవతను తలెత్తేలా నిల బెట్టావు !

జగమెరిగిన ఈ జగదభిరాముడు
జగమంతా తానే కొలువై ఉన్నాడు
జనం అందరి మనసెరిగినవాడు
జానకి మాతను మనువాడిన రేడు

జగదభిరాముడవై అవశ్యం నిలిచావు
జగద్రక్షకుడవై ఈ విశ్వమునే గెలిచావు
జనం కష్టసుఖాల నీవిగానే తలచావు
క్షణం ఆగక నీ ఇష్టసఖుల వైపే నిలిచావు !

ఆకలి తెలిసికొని నీవు అన్నం పెట్టావు
కష్టం కనుగొని కన్నీరుని తుడిచావు
ఆకలిదప్పులు లేకుండా చూసుకున్నవు
ఒళ్లంతా కళ్ళు చేసుకుని అందరిని కాచుకున్నవు!

ఈ రఘురాముడు జన్మించిన పుణ్యదినం
మనమంతా సగర్వంగా చేసుకునే పర్వదినం
మన సీతారాముల కళ్యాణం కమనీయం
ఘన కన్నుల వెన్నెల పండుగ వైభోగం !


కామెంట్‌లు